డొంక తిరుగుడొద్దు: చిరుపై విజయశాంతి

తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి స్పష్టత లేదని ఆమె విమర్శించారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదనే డొంక తిరుగుడు ప్రకటనలు వద్దని ఆమె అన్నారు. తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తల్లి తెలంగాణ విలీనంపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆమె జవాబు దాటవేశారు. తెలంగాణ పార్టీల మధ్య ఐక్యతకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చొరవ చూపడం హర్షణీయమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications