అమెరికాలో విక్రమ్ రెడ్డి హత్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు చెందిన సౌమ్య తో పాటు ఆమె పెద్దమ్మ కుమారుడు విక్రమ్ రెడ్డి కూడా హత్యకు గురయ్యాడు. 27 ఏళ్ల విక్రమ్ రెడ్డి శవం రెండు రోజుల తర్వాత పార్కు పక్కనే ఉన్న సరస్సులో తేలుతూ కనిపించింది. అతని శరీరంపై తూటాల గాయాలున్నాయి. సౌమ్య హత్య తర్వాత విక్రం రెడ్డి కనిపించకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ఇద్దరిని దుండగులు ఒకేసారి హత్య చేసినట్లు భావిస్తున్నారు.
సౌమ్య తల్లి హేమలత అక్క రమ కుమారుడు విక్రంరెడ్డి. అతని తండ్రి తుమ్మల వెంకట్ రెడ్డి నిజామాబాద్ జిల్లా రత్నాపూర్ కు చెందినవారు. శ్రీరాంసాగర్ కింద రత్నాపూర్ ముంపునకు గురి కావడంతో ఆ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. తండ్రి మరణం తర్వాత సౌమ్య కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి వీరి ఇంట్లోనే ఉంటోంది. మూడేళ్ల క్రితం టెక్సాస్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో విక్రం రెడ్డి అమెరికా వెళ్లాడు. అతని ప్రోత్సాహంతోనే సౌమ్యతో పాటు ఆమె అక్క సహజ కూడా ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు.












Click it and Unblock the Notifications