బాలయ్యపై లక్ష్మీపార్వతి ఫిర్యాదు

ఆ తర్వాత బాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. ట్రస్టుతో లక్ష్మీపార్వతికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన అందులో అన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీరామారావుతో లక్ష్మీపార్వతికి జరిగిని పెళ్లికి చట్టబద్దత లేదని ఆయన అన్నారు. తొలి వివాహం రద్ద కాకుండా తన తండ్రిని వివాహం చేసుకున్నారని ఆయన అన్నారు. తన తండ్రికి సమాజంలో ఉన్న అధికారాన్ని చూసి లక్ష్మిపార్వతి ప్రేమించారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని లక్ష్మీపార్వతి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications