సిపి ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యా యత్నం
హైదరాబాద్: విజయవాడ పోలీసు కమీషనర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం పూర్ణచందర రావు అనే వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తాను తీసుకున్న అప్పుల విషయంలో ఇద్దరు వ్యక్తులు తనను వేధిస్తున్న విషయమై పోలీసు కమీషనరుకు విన్నవించుకోవడానికి పూర్ణచందరరావు వచ్చాడు. అయితే, కమీషనర్ కలవడంలో జాప్యం కావడంతో తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కానిస్టేబుళ్లు 108 అంబులెన్సులో అతన్ని అస్పత్రికి తరలించారు.
రవూఫ్, సత్యనారాయణ అనే వ్యక్తుల వద్ద పూర్ణచందరరావు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాడు. అయినా వారిద్దరు పూర్ణచందరరావును వేధించడం ప్రారంభించారు. ఈ విషయమై పోలీసు కమీషరుకు విన్నవించుకోవడానికి పూర్ణచందరరావు వచ్చాడు. వస్తూ వస్తూ తనతో పాటు క్వార్టర్ బ్యాటిల్ లో పురుగుల మందు తెచ్చుకున్నాడు. అకస్మాత్తుగా దాన్ని సేవించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications