విజయశాంతిపై మాట్లాడను: చిరు

చేనేత కార్మికుల సమస్యలపై, వారి సాధకబాధకాలపై అధ్యయనం చేసేందుకు మాజీ పార్లమెంటు సభ్యుడు కె.ఎస్.ఆర్. మూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. మరికొందరు సభ్యులను ఈ కమిటీలో వేస్తామని ఆయన చెప్పారు. ఈ కమిటీ పది, పదిహేను రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. నివేదికను పరిశీలించి, ఆ అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని ఆయన చెప్పారు. చేనేత కార్మికులకు అన్ని విధాలా మేలు చేశామని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనను ప్రస్తావించగా చేయాల్సినంత చేయడం లేదని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications