చిరంజీవితో మాట్లాడాను: నారాయణ
తిరుపతి: ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో తాను మొన్న రాత్రి సమావేశమైనట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. ఈ చర్చల్లో చిరంజీవితో పాటు ఆయన బావమరిది అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారని నారాయణ మంగళవారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. వామపక్షాలతో కలిసే నడుస్తామని చిరంజీవి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. సిపిఎం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు సిపిఎం ప్రకటించలేదని ఆయన అన్నారు. తాము ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నామని ఆయన అన్నారు.
ప్రజారాజ్యం పార్టీతో తమకు భావసారూప్యత ఉండడం వల్లనే తాము చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలోనూ, తెలంగాణ విషయంలోనూ చిరంజీవితో తమకు అభిప్రాయాలు కలుస్తున్నాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్లు పాలన చేసిందని, ఈ స్థితిలో మూడో ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుందని తమ ఆలోచన అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications