రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఘనపూర్ గ్రామం వద్ద లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.
బత్తాయి పండ్ల లోడ్ తో నల్లగొండ జిల్లా దేవరకొండ వెళ్తున్న లారీ ఘనపూర్ వద్ద బోల్తా పడింది. లారీ కింద పడి ఆరుగురు మరణించారు. బత్తాయి పండ్ల కింద చిక్కుకున్న మరో ముగ్గురు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications