మా బలం చూసి భయపడే...: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలన్నీ గందరగోళంలో ఉన్నాయని, దాంతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కాంగ్రెస్ పై ప్రజల విశ్వసనీయత పెరిగిందని, దాంతో తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవగలమని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. 2004 ఎన్నికల్లో తమకు తగిన బలం లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు ఆ అవసరం లేదని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడం వల్ల తమపై ప్రజల విశ్వసనీయత పెరిగిందని, దాంతో తమ బలం పెరిగిందని ఆయన వివరించారు. పొత్తుల కోసం తమ వద్దకు ఎవరైనా వస్తే మాట్లాడ్తామని ఆయన అన్నారు.

తొమ్మిదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని, నాలుగున్నర ఏళ్ల పాలనతో తాము విశ్వసనీయతను పెంచుకున్నామని, అది వారి బలహీనత ఇది తమ బలమని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు తమంతట తాము పోటీ చేసి గెలిచే సత్తా లేదు కాబట్టి పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయని, కాంగ్రెస్ బలం చూసి ఆ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తాము ఎవరినీ తక్కువ చేయడం లేదని, అలా తక్కువ చేసే లక్షణం కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు తాము చేసినంత మేలు ఎవరూ చేయలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+