కాంగ్రెసుపై అమర్ సింగ్ రుసరుసలు

Amar Singh
న్యూఢిల్లీ: కాంగ్రెసుతో పొత్తు పట్ల సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అమర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు విషయంలో కాంగ్రెసు అనుసరిస్తున్న వైఖరి పట్ల తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రషీద్ తనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.

కాంగ్రెస్ వ్యక్తిత్వ హననానికి దిగుతోందని, తాను తలుచుకుంటే కాంగ్రెసులోని చాలా మంది పెద్దల బండారం బయట పెట్టగలనని ఆయన అన్నారు. అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎస్పీ మద్దతు ప్రకటించింది. ఇరు పార్టీల మధ్య స్నేహం కుదిరిన ఎంతో కాలం కాకుండానే విభేదాలు ముదురుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో సీట్ల సర్దుబాటుపై ఈ రెండు పార్టీల మధ్య మూడో విడత చర్చలు ఈ నెలాఖరున జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+