మధురై మీనాక్షికి తీవ్రవాద ముప్పు
చెన్నై: తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయానికి తీవ్రవాద ముప్పు ఉన్నట్లు కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలపై తీవ్రవాదులు దాడి చేయవచ్చుననే సమాచారం అందడంతో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో తీవ్రవాదుల దాడులు జరగవచ్చునని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసినట్లు తమిళనాడు ఎడిజిపి చెప్పారు.
లష్కర్ - ఎ - తోయిబా రాష్ట్రంలో దాడులకు దిగే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కరుణానిధి పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications