విజయశాంతిని ఆహ్వానించాను: కెసిఆర్

సిపిఐ, సిపిఎం, తెరాస విడివిడిగా ఉండకూడదని ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో జరిపిన చర్చల సందర్భంగా అవగాహనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తాను సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో తాను మాట్లాడానని, సిపిఎం తెలంగాణకు వ్యతిరేకం కాదని కారత్ చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉండకూడదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులుకు సూచించాలని తాను నారాయణను కోరినట్లు ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీతో తాము పలు మార్లు చర్చలు జరిపిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఇరు పార్టీలు కొన్ని అంశాలపై కలిసి పోరాటం చేయడంతో సాన్నిహిత్యం పెరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణకు అత్యధికంగా మేలు జరిగే పార్టీతో తాము వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications