తిరుపతి: రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. తిరుపతిలో జగన్ యువసేన ప్రదర్శన నిర్వహించింది. ర్యాలీ కూడా నిర్వహించింది. 2009 సాధారణ ఎన్నికల లోగా జగన్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని జగన్ అభిమానులు కోరుకుంటున్నారు.
జగన్ రాకవల్ల రాజకీయం మలుపు తిరుగుతుందని కాంగ్రెస్ శాసనసభ్యుడు వెంకటరమణ అన్నారు. జగన్ సేవలు పార్టీకి చాలా అవసరమని ఆయన అన్నారు. గత కొంత కాలంగా జగన్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుతున్నారు.