కరీనాతో సైఫ్ పెళ్లి అయిందా?
{image-saif & kareena_25092008.jpg telugu.oneindia.com}ముంబయి: బాలీవుడ్ ప్రేమ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ల పెళ్లి జరిగినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజ్ కుమార్ హిరానీ సినిమా 3 ఇడియట్స్ షూటింగ్ నుంచి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తిరిగి రావడం, కరీనా కపూర్ రాకపోవడంతో ఆ ప్రచారం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ లడఖ్ లో జరిగింది. ఈ సినిమాలో కరీనా, అమీర్ నటిస్తున్నారు. "కరీనా, నేను లడక్ లో ఉన్నప్పుడు సైఫ్ రాలేదు. అతను వస్తాడని విన్నాను. షూటింగ్ ముగియగానే కరీనా వెళ్లిపోయింది. ఆ తర్వాత సైఫ్, కరీనా ఎప్పుడు, ఎక్కడ కలిశారనేది నాకు తెలియదు. ఒక వేళ వారు పెళ్లి చేసుకున్నా కూడా ఆ విషయం నాకు తెలియదు" అని అమీర్ ఖాన్ వారి పెళ్లి ప్రచారంపై వ్యాఖ్యానించారు.
గత ఆదివారం కరీనా జన్మ దినం కోసం సైఫ్ శ్రీనగర్ వెళ్లినట్లు, కరీనా జన్మదిన వేడుకలను ప్రత్యేక జరపడం కోసం అతను వెళ్లినట్లు తెలుస్తోంది. తాషాన్ షూటింగ్ సందర్భంగా సైఫ్, కరీనాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2007 వేసవిలో జరిగిన లాక్మే ఫేషన్ గ్రాండ్ పైనల్ షోల తమ మధ్య గల సంబంధాన్ని వారిద్దరు బాహ్యప్రపంచానికి తెలియజేశారు.












Click it and Unblock the Notifications