లగడపాటి వ్యాఖ్య సరి కాదు: జీవన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఉగ్రవాద సంస్థగా తమ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభివర్ణించడం సరైంది కాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ తెలంగాణవాదాన్ని కించపరచలేదని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపిపి) నేత టి. దేవేందర్ గౌడ్ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ల్యాంకో కార్యాలయంపై దాడికి చంద్రశేఖరరావే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయంలో జాప్యం తమ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications