చిరు ప్రసంగంపై బాధితుల అసంతృప్తి
మహబూబ్‌నగర్: తమ దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము ఎంతోకాలంగా పోరుతున్నామనీ, దీనిపై చిరంజీవి స్పష్టమైన హామీ ఇవ్వలేదని పోలేపల్లి సెజ్ బాధితులు శుక్రవారం మధ్యాహ్నం నిరసనకు దిగారు. చిరంజీవి ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమైంది.
చిరంజీవి ప్రసంగంలో స్పష్టత లేదనీ, తమకు ఏం చేస్తారో చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వెనక్కి తిరిగి వచ్చి సెజ్ బాధితుల ఐక్య సంఘటన సభ్యులతో మాట్లాడారు. ఈ సమస్యను అధ్యయనం చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications