మన్మోహన్ పై బుష్ ప్రశంసలు

తాము భారత్ తో బలమైన మంచి వ్యూహాత్మక సంబంధాలను ఆశిస్తున్నామని, తాము ఇందుకు విశేషంగా కృషి చేశామని ఆయన అన్నారు. ఆ విధమైన సంబంధాలకు భారత - అమెరికా పౌర అణు ఒప్పందం నిదర్శనమని ఆయన అన్నారు. అమెరికా, భారత్ రెండు దేశాలకు సంతృప్తికరంగా ఉండేలా ఒప్పందం ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ చెప్పారు. బుష్ భారత్ ను, ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ గొప్ప దేశమని, బంగారు భవిష్యత్తు ఉన్న దేశమని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని, మిత్రపూరిత వైఖరిని ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications