ఆ అధికారుల ఆస్తుల విలువ కోట్లే
హైదరాబాద్: సచివాయలంలో వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ కర్రి అప్పారావు, సెక్షన్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోమవారం ఏకకాలంలో దాడి చేశారు. ఈ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై వారు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల ఆస్తులను ఎసిబి అధికారులు కనుగొన్నారు. హైదరాబాదులోని డిడి కాలనీలో గల కర్రి అప్పారావు ఇంటిలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పారావుకు హైదరాబాదులో ఇళ్లు, సామర్లకోటలో ప్లాట్లు ఉన్నట్లు కనుక్కున్నారు. విశాఖపట్నం, అనకాపల్లిల్లో గల ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
రామచంద్రారెడ్డి ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. రామచంద్రారెడ్డికి ఆరు ప్లాట్లు, మూడు ఇళ్లు, 3 లారీలు ఉన్నట్లు ఎసిబి అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే, ఆయన స్వస్థలం కడపలో కూడా సోదాలు జరిగాయి. వీరిద్దరు మంత్రి సంభానీ చంద్రశేఖర్ వద్ద వ్యక్తిగత సహాయకులుగా పని చేయడం విశేషం. ఈ దాడుల్లో మూడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కనుక్కున్నట్లు ఎసిబి జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications