విజయశాంతితో మాట్లాడాను: కిషన్
హైదరాబాద్: తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతితో తాను రాజకీయాలు చర్చించానని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. అయితే రాజకీయ ఎజెండాతో తమ భేటీ జరగలేదని ఆయన చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆయన విజయశాంతిని ఆమె నివాసంలో కలుసుకున్నారు. మధ్యాహ్నభోజనానికి తాను విజయశాంతి నివాసానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. కానీ, పిచ్చాపాటీగా రాజకీయాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు.
తెలంగాణకు అనుకూలంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) తీర్మానం చేస్తే ఎన్నికలకు ముందే తెలంగాణ పార్టీలు బిజెపితో కలిసి పనిచేయాలని విజయశాంతి అన్నారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications