నా మీది కోపం కుప్పం మీద: బాబు

నిరుద్యోగులకు వేయి రూపాయల చొప్పున భృతి ఇస్తామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేదల గృహాలకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదల కొత్త ఇళ్లకు లక్ష రూపాయలేసి ఇస్తామని ఆయన చెప్పారు. రామకుప్పం వద్ద చంద్రబాబు కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఢీకొన్నాయి.
అమెరికా ఒత్తిళ్లకు లొంగి అణు ఒప్పందం చేసుకుంటే దేశానికి ప్రమాదమని, అమెరికా నిర్దేశం ప్రకారం మనం నడుచుకోవాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా ప్రజలను మోసం చేసి, తప్పుడు సమాచారం ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. దేశప్రయోజనాలను కాలరాసే విధంగా ఒప్పందం చేసుకోవడం గర్హనీయమని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఫణంగా పెడుతోందని ఆయన అన్నారు. ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో అవినీతిలో ఎవరూ పోటీ పడలేరని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం నాలుగు కిలోల బియ్యం మాత్రమేనని, అది ఎన్ని రోజులకో సరిపోదని, ధరలు పెరగడంతో మిగతా రోజులకు బియ్యం కొనలేదని స్థితిలో ప్రజలున్నారని ఆయన అన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎరువులున్నా రైతులకు అందించే స్థితిలో లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications