సాహితీ వేత్త పేర్వారం కన్నుమూత
వరంగల్: ప్రముఖ సాహితీవేత్త పేర్వారం జగన్నాథం సోమవారం వరంగల్ లోని ఒక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన వైస్ చాన్సలర్ గా పనిచేశారు. ఆయన వరంగల్ జిల్లా కిలాస్ఫూరులో 1934లో జన్మించారు. చాలా కాలంగా ఆయన వరంగల్లులో ఉంటున్నారు.
ఆయన పలు కావ్యాలు రాశారు. చేతనావర్త కవుల్లో ఆయన ఒకరు. సాగర సంగీతం, వృషభపురాణం, గరుడు పురాణం కవితా సంపుటాలను ఆయన వెలువరించారు. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, సాహితీ సౌరభం, పేర్వారం పీఠికలు అనే వ్యాససంపుటాలు రాశారు. తెలుగు సాహిత్యంపై అరె మరాఠీ సాహిత్య ప్రభావం అనే అంశంపై ఆయన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. అభ్యుదయానంతర ధోరణులు, దేశీయ కవితా ప్రస్థానం, రాజకీయాలు - సాహిత్యం - సమాజం అనే పుస్తకాలకు ఆయన సంపాదకత్వం వహించారు.












Click it and Unblock the Notifications