తిరుపతి దగ్గర నలుగురి హత్య
తిరుపతి: తిరుపతి సమీపంలోని బాకరాపేట వద్ద సోమవారం నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. సంఘటనా స్థలం వద్ద మూడు మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. వీరు హత్యకు గురైన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కారులో మృతుల ఫోటోలు, వివరాలు ఉండటంతో నలుగురు హత్యకు గురయ్యారని పోలీసులు నిర్ధారించారు.
మృతులు కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ రామచంద్రారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. మరో ముగ్గురిని కూడా గుర్తించారు. మరో మృతదేహం ఇంకా దొరకలేదు. కారులో ఓ ఆస్తికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి కూడా ఉంది. దీంతో ఈ హత్యకు ఆర్థిక వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications