వైద్యుల సమ్మె: నిలిచిపోయిన సేవలు
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యులు సోమవారం సమ్మె ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాదులోని ఉస్మానియా, సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రుల్లోనూ, విశాఖపట్నంలోని కెజిహెచ్ లోనూ, వరంగల్ లోని ఎంజిఎం అస్పత్రిలోనూ వైద్యులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు హాజరవుతున్నారు.
తమ డిమాండ్లను వచ్చే మూడు రోజుల్లో పరిష్కరించకపోతే అక్టోబర్ 2వ తేదీనుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని వైద్యుల సంఘం తెలియజేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలని సంఘం డిమాండ్ చేస్తోంది. వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ మాట మారుస్తోందని విమర్శించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత 30 ఏళ్లలో మొదటిసారి వైద్యులు నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందని వైద్యుల సంఘం నాయకులన్నారు. పదోన్నతుల విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications