అహ్మదాబాదులో 17 నాటు బాంబులు
అహ్మదాబాద్: అహ్మదాబాద్ లోని కాలాపూర్ దర్వాజా ప్రాంతంలో పోలీసులు సోమవారంనాడు 17 నాటు బాంబులను కనిపెట్టారు. ఈ బాంబులు అధునాతమైనవేమీ కాదని, నాటురకం పేలుడు పదర్ధాలని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలో ఈ నాటు బాంబులు లభించడం సంచలనం కలిగిస్తోంది. ఈ బాంబులను చిన్నపాటి పొగాకు డబ్బాల్లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. వీటి తీవ్రత తక్కువగానే ఉందని, వెంటనే వాటిని నిర్వీర్యం చేసామని వారు చెప్పారు. జులై 26వ తేదీన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 56 మంది మరణించారు.












Click it and Unblock the Notifications