తెలంగాణ బిల్లుకు మద్దతు: కత్తి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే తాము బలపరచడానికి వెనకాడబోమని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కత్తి పద్మారావు చెప్పారు. తెలంగాణ పార్టీలన్నీ ఏకమై శాసనసభలో తెలంగాణపై తీర్మానం పెట్టేందుకు ఇతర పార్టీలపై ఒత్తిడి తేవాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సామాజిక న్యాయ సూత్రమే తమకు ప్రధానమని ఆయన చెప్పారు.

తమ పార్టీ అధినేత చిరంజీవి సిరిసిల్లను సందర్శించిన తర్వాతనే చేనేత కార్మికుల సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన చెప్పారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీని వేయాలని ఆయన సూచించారు. అఖిల పక్ష కమిటీని కూడా వేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని చేనేత కార్మికులకు పని కల్పించడమే కాకుండా వారు నేసిన బట్టలకు మార్కెట్ కల్పించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+