13 వేల పాయింట్లకు దిగువన సెన్సెక్స్
ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల బాటలో పయనిస్తోంది. ఆసియా స్టాక్ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో సోమవారం ఉదయం లావాదేవీల్లో 108 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 13 వేల పాయింట్ల కిందకు పడిపోయింది. ఇంతకుముందు ట్రేడ్ సెషన్‌లో 445 పాయింట్ల నష్టాన్ని చవిచూసిన సెన్సెక్స్, రియాల్టీ, ఐటీ, బ్యాంకింగ్స్ రంగాలకు చెందిన వాటాలు నష్టాల్లో కూరుకపోవడంతో 108.46 పాయింట్ల కోల్పోయి 12,993.72 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా సోమవారం నష్టాల బాటలో నడుస్తోంది. ఉదయం లావాదేవీల్లో నిఫ్టీ 49.95 పాయింట్లు కోల్పోయి 3,935.30 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్‌ల ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌లను నష్టాల బాట పట్టించిందని స్టాక్‌బ్రోకర్లు చెప్పారు. డీఎల్ఎఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, సత్యం, టీసీఎస్, విప్రో, ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్ కంపెనీల నష్టాలు సెన్సెక్స్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఇదిలా ఉంటే హాంకాంగ్‌లోని హాంగ్ సెగ్ సూచి ఉదయం లావాదేవీల్లో 2.15 శాతం పతనమైంది.












Click it and Unblock the Notifications