ఐసీఐసీఐపై అన్నీవదంతులు: కామత్
ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకుపై వస్తున్న వదంతులన్నీ నిరాధారమైనవని ఆ బ్యాంకు ఛైర్మన్ కేవీ కామత్ ప్రకటించారు. అమెరికా పరిణామాలు తమ బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన అన్నారు. దీనిపై తమ ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు. తమ బ్యాంకు నికర ఆస్తుల విలువే 4.84 లక్షల కోట్లు ఉందని ఆయన తెలిపారు.
ఐసిఐసిఐ బ్యాంకు దివాళా మార్గం పట్టిందని, దీంతో ఖాతాదారులు ఎటిఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారని వార్తలు వచ్చాయి. దీంతో ఖాతాదారులు మరింతగా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కామత్ వివరణ ఇచ్చారు. ఐసిఐసిఐపై వదంతులు నమ్మవద్దని రిజర్వ్ బ్యాంకు కూడా సూచించింది. ఐసిఐసిఐ వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications