గుడిలో తొక్కిసలాట: 40 మంది మృతి
జోథ్ పూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్ పూర్ లో గల చాముండి దేవి ఆలయంలో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా భక్తులు మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల మొదటి రోజే చాముండి దేవి ఆలయం నెత్తురోడింది. ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పది వేల మందికి పైగా భక్తులు వచ్చి ఉంటారని ఒక అంచనా.
చాముండి ఆలయం ప్రసిద్ధి చెందిన జోథ్ పూర్ కోటపైన ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 30 మంది శవాలను మహాత్మా గాంధీ ఆస్పత్రికి, మరో పదిమంది శవాలను మథురా దాస్ ఆస్పత్రికి తరలించినట్లు డివిజనల్ కమీషనర్ కిరణ్ సోనీ గుప్తా చెప్పారు. భక్తుల మధ్య తొక్కిసలాటకు కారణాలు మంగళవారం ఉదయం 9 గంటల వరకు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications