సాలార్ ఓవైసీకి అంతిమ వీడ్కోలు
హైదరాబాద్: మజ్లీస్ అధినేత సాలార్ సల్లావుద్దీన్ ఓవైసీ భౌతిక కాయానికి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులోని నాంపల్లిలో గల దర్గాలో అంత్యక్రియలు జరిగాయి. అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్ పాతబస్తీలో తిరుగులేని నేతగా వెలుగుతూ వచ్చిన ఓవైసీ సోమవారం రాత్రి కన్ను మూశారు. పార్టీ కార్యాలయం దారు సలాం నుంచి ఊరేగింపుగా ఓవైసీ భౌతిక కాయం దర్గాకు చేరుకుంది. నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఈ ఊరేగింపు సాగింది.
హైదరాబాదులోని హిమాయత్ నగరులో గల ఆయన నివాసం నుంచి ఓవైసీ భౌతిక కాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం పార్టీ కార్యాలయానికి తరలించారు. ఓవైసీ భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ వీరప్ప మొయిలీలతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులతో పాటు పలువురు నాయకులు కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications