రెండు ప్రమాదాలు: ఆరుగురు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మంగళవారం ఉదయం ఆరుగురు మరణించారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ముగ్గురు మరణించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కచ్చిరాపల్లి గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఒక వ్యక్తి గాయపడ్డాడు. లారీ పక్కనే నిలిచి ఉన్న నలుగురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో వారిలో ముగ్గురు మరణించారు.












Click it and Unblock the Notifications