గుడిలో తొక్కిసలాట: మృతులు 179 మంది

సంఘటనా స్థలం హృదయవిదారకంగా ఉంది. భక్తుల హాహాకారాలతో ఆ ప్రదేశం మారుమ్రోగింది. స్థానిక ఆస్పత్రుల్లో శవాలు పడేసి ఉన్నాయి. ఈ సంఘటనపై దర్యాప్తు చేయిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ హోం మంత్రి గలాబ్ సాంద్ కటారియా విలేకరులతో అన్నారు. జోథ్ పూర్ సమీపంలో ని మెహ్రాఘర్ లో బాంబు ఉన్నట్లు ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, దీంతో తొక్కిసలాట జరిగిందని తొలుత టీవీ వార్తాకథనాలు వెలువడ్డాయి. చాముండీశ్వరీ ఆలయానికి పెద్ద యెత్తున భక్తులు వచ్చారు. దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి విజయరాజే సింథియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications