రాఘవులుతో కెసిఆర్ పొత్తు చర్చలు

తాము ఇంకా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని రాఘవులు చర్చల అనంతరం చెప్పారు. కాంగ్రెసును ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామని ఇరువురు నాయకులు చెప్పారు. తెలంగాణపై సానుకూల వైఖరి తీసుకోవాలని కెసిఆర్ రాఘవులును కోరారు. తాము తెలంగాణకు అడ్డంకి కాదని ఇంతకు ముందు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పిన నేపథ్యంలో ఈ భేటీ జరిగిందని భావిస్తున్నారు. ఇంతకు ముందు కెసిఆర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో కూడా కెసిఆర్ చర్చించారు. మూడో కూటమి ప్రస్తావన లేకుండా రాఘవులుతో కెసిఆర్ చర్చలు జరిగినట్లు సమాచారం. దాదాపు గంట పాటు వీరద్దరి మధ్య చర్చలు జరిగాయి.
వామపక్షాలు కలిసి ఉండాలని, కాంగ్రెసును ఓడించడానికి రెండు వామపక్షాలు కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని కెసిఆర్ రాఘవులుతో చెప్పారు. తాము కూడా అదే కోరుకుంటున్నామని, కాంగ్రెసును ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని రాఘవులు కెసిఆర్ తో చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications