హైదరాబాదులో ఢీకొన్న రెండు రైళ్లు

ఈ సంఘటనలో వాడి ప్యాసింజర్‌కు చెందిన రైలు బోగీలు దెబ్బతిన్నాయి. 17 మంది వరకు గాయపడ్డారు. ఇందులో 10 మంది రైల్వే ఉద్యోగులు కాగా మిగిలిన వారు ప్రయాణీకులు. గాయపడిన వారిని చికిత్సకోసం రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ సమయంలో అక్కడికి రావలసిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను స్టేషన్‌కు చాలా దూరంలో ఆపటంతో ప్రయాణీకులు నడిచి రావలసి వచ్చింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మానవ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications