విపక్షాల ఐక్యతకు ప్రతిపాదన: నారాయణ
మెదక్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సూచించారు. కర్ణాకట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా అధికారాన్ని పంచుకోవడానికి ప్రతిపక్షాలు ఒక అవగాహనకు రావాలని ఆయన అన్నారు. మెదక్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రతిపక్షాల ఐక్యతకు మేధావులు, ఆలోచనాపరులు ప్రతిపాదనలు ముందుకు తెచ్చారని, దీనిపై తాము చర్చిస్తున్నామని, ఇతర పార్టీలు కూడా చర్చించాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి తాను ఇంతకు ముందే ప్రజారాజ్యం పార్టీ నాయకులతో మాట్లాడానని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో చర్చించానని, సిపిఎంతో చర్చిస్తానని ఆయన వివరించారు. ప్రతిపక్షాలు అధికార పంపకంపై ఒక అవగాహనకు వస్తే తెలంగాణ నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications