చిరు ప్రజారాజ్యంలో సివి శేషారెడ్డి
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఉపాధ్యక్షుడు సి.వి.శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆయన బుధవారం ప్రజారాజ్యంలో చేరారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషారెడ్డి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెసులో ఉంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఆయన గతంలో శాసనసభకు ఎన్నికయ్యారు.
ముఠా కక్షల వల్లనే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసినట్లు శేషారెడ్డి చెప్పారు. చిరంజీవి నాయకత్వంలో సమ సమాజం, నవ సమాజం ఏర్పడుతుందనే విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందనే విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications