ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
హైదరాబాద్: శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి, శ్రీశైలం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై బుధవారం కనకదుర్గ అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం చేశారు. తెల్లవారుజామునుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారికి ఈరోజు బ్రహ్మచారిణి అలంకారం చేశారు. మల్లికార్జునుడు, భ్రమరాంబికా అమ్మవారిని మయూరవాహనంపై వూరేగించారు.
దక్షిణ కాశిగా పేరు గాంచిన కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం దేవి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారు శైలపుత్రి అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కన్యకా సుహాసిని పూజ, చతుష్టోపచార పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది అమ్మవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications