అక్టోబర్ 1న బ్లాక్ డే: టిజి వెంకటేష్
కర్నూలు: రాయలసీమలోని కర్నూలును ప్రత్యేక రాజధానిగా గుర్తించేంత వరకు అక్టోబర్ 1వ తేదీని బ్లాక్ డేగా పరిగణిస్తామని రాయలసీమ హక్కుల వేదిక నాయకుడు టి.జి. వెంకటేష్ చెప్పారు. ఏటా అక్టోబర్ 1వ తేదీని బ్లాక్ డేగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. కర్నూలు రాష్ట్రానికి రెడో రాజధానిగా చేయాలని ఆయన బుధవారం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాజధానిని హైదరాబాదుకు తరలించి రాయలసీమకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే కర్నూలును ఆంధ్ర రాజధానిగా చేయాలని, తెలంగాణతో కలిసి ఉంటే కర్నూలును రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్ల రూపాయలకు పైగానే నష్టపరిహారం రాయలసీమకు వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications