సిరిసిల్లలో ముగ్గురు చేనేత కార్మికుల మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మరో ముగ్గురు చేనేత కార్మికులు బుధవారం మృత్యువాత పడ్డారు. ఒక కార్మికుడు అప్పుల బాధ తట్టుకలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఇద్దరు ఆకలి బాధ తట్టులేక అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ఇటీవల సిరిసిల్లలో ఒకే రోజు ముగ్గురు చేనేత కార్మికులు ఆత్యహత్యలు చేసుకున్న సంఘటన తడి ఆరకముందే బుధవారం ముగ్గురు చేనేత కార్మికులు మరణించడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
ఇదిలా వుంటే, చేనేత కార్మికుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో హైదరాబాదులోని సచివాలయంలో సమీక్షించారు. చేనేత కార్మికుల మరణాలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చేనేత శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తారు. సిరిసిల్ల తెలుగుదేశం శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు నేతృత్వంలో అఖిల పక్ష బృందం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది. 27 అంశాలతో ఈ బృందం వినతిపత్రం సమర్పించింది.












Click it and Unblock the Notifications