కృష్ణ మహేష్ సేన ఆవిర్భావం
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు అభిమాన సంఘాలు గురువారం ఒక్కటయ్యాయి. తమ సంఘానికి కృష్ణామహేష్ అభిమాన సేన అని పేరు పెట్టుకున్నాయి. ప్రజాసేవే సౌభాగ్యం అనే ట్యాగ్ లైన్ కూడా ఈ అభిమాన సంఘానికి ఇచ్చుకున్నారు. ఈ సంఘానికి కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తారు.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన నేపథ్యంలో కృష్ణ, మహేష్ బాబు సంఘాల ఏకీకరణ జరిగిందని భావిస్తున్నారు. కృష్ణ కాంగ్రెసుకు సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబును ప్రచార రంగంలోకి దించాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన కృష్ణ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. కృష్ణ, మహేష్ అభిమానులు గతంలో వరుణ యాగం కూడా చేశారు.












Click it and Unblock the Notifications