అణు ఒప్పందానికి సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా, భారత్ అణు ఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. వంద మంది సభ్యులు గల సెనేట్ లో 86 మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు చేయగా 13 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు. అణు ఒప్పందంపై సెనేట్ ఆమోద ముద్ర వేయడంతో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ కల నెరవేరినట్లయింది. ఆయన విదేశాంగ విధానంలో ఈ ఒప్పందం అత్యంత ప్రధానమైంది.
అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ నిజానికి బుధవారంనాడే భారత్ చేరుకోవాల్సింది. అయితే ఆమె పర్యటన తేదీలు మారాయి. ఆమె శనివారం భారత్ చేరుకుంటారు. అణు ఒప్పందంపై న్యూఢిల్లీలో కండోలిజా రైస్, భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సంతకాలు చేస్తారు.
అణు ఒప్పందానికి సెనేట్ ఆమోదం తెలపడంపై అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం తమ ప్రపం అణు నిరాయుధీకరణ కృషిని పటిష్టం చేస్తుందని ఆయన అన్నారు. పెరుగుతున్న ఇంధన వనరుల అవసరాలను తీర్చుకోవడానికి ఇది భారత్ కు తోడ్పడుతుందని ఆయన అన్నారు. అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications