నేనిమిటో చూపిస్తా: హీరో బాలకృష్ణ
హైదరాబాద్ : యువగర్జన సదస్సుతో తానేమిటో చూపిస్తానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తన అభిమానులతో హీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం సమావేశమయ్యారు. నగరంలోని రామకృష్ణా స్టూడియోలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో ఆయన చర్చలు జరిపారు. గుంటూరులో ఈ నెల 24వ తేదీన జరగనున్న యువగర్జన సభకు సంబంధించి ఆయన చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దృష్టి సారించారు.
ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, అందరూ కలిసికట్టుగా పని చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆయన తన అభిమానులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో మాట్లాడి తన అభిమానుల్లో కొందరికి టికెట్లు ఇప్పిస్తానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న పాల్గొన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications