ప్రజారాజ్యంలోకి టిడిపి ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యంలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇందుకు గాను ఆయన హైదరాబాద్ బయలుదేరారు. జిల్లాలోని పార్టీలోని విభేదాలే ఆయన రాజీనామాకు కారణమని భావిస్తున్నారు. తాను పార్టీలో ఎంత వేదనకు గురయ్యానని ఆయన చెప్పారు. ఆయనను బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడేనని, చంద్రబాబుకు తాను రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. జిల్లాలోని కొందరు నేతలతో కుదరకనే తాను బయటకువచ్చినట్టు ఆయన తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంతత కోసమే ప్రజారాజ్యంలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.చిరంజీవి ఉత్తరాంధ్ర పర్యటనకుముందే ప్రజారాజ్యం సభ్యత్వం తీసుకుంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+