ఎన్నికల్లో లెప్ట్ తో కలుస్తాం: కెసిఆర్
న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో తమ మధ్య కుదిరే పొత్తులకు తెలంగాణ అంశం అడ్డంకిగా ఉండరాదన్నదే తమ అభిమతమని తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరితో ఆయన చర్చలు జరిపిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని సీతారాం ఏచూరి అన్నారు. అయితే తమ పార్టీ భాషాప్రయుక్తరాష్ట్రాలకే కట్టుబడివుందని స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణను అడ్డుకోబోమని ఆయన కెసిఆర్ కు హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో సిపిఎం,సిపిఐ, తాము కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయపరిస్థితులపై ఆయన ప్రకాష్ కారత్, ఏచూరిలతో చర్చించారు. పొత్తులకు తెలంగాణ అంశం అడ్డంకి కాదని ఆయన అన్నారు. తాము వద్దన్నా దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని సీతారాం ఏచూరి చెప్పారు.












Click it and Unblock the Notifications