మహేష్ రాజకీయాల్లోకి రాడు: కృష్ణ
హైదరాబాద్: తన కుమారుడు, ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడని సూపర్ స్టార్ కృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాదులోని పద్మాలయ స్టూడియోలో ఆయన ఆదివారంనాడు కృష్ణ మహేష్ అభిమానులతో సమావేశమయ్యారు. కాంగ్రెసుకు తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని ఆయన అభిమానులను కోరారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మద్దతివ్వాలని ఆయన సూచించారు.
కాంగ్రెసు విజయానికి వచ్చే ఎన్నికల్లో కృషి చేయాలని ఆయన అభిమానులను కోరారు. తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెసుకు అనుకూలమని కృష్ణ చెప్పారు. కృష్ణ, మహేష్ అభిమానులు కలిసి ఇటీవల కృష్ణ మహేష్ సేనను ఏర్పాటు చేశారు. ప్రజాసేవ చేయడానికి ఈ సేనను ఏర్పాటు చేసినట్లు అభిమానులు చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, తెలుగుదేశం పార్టీ కోసం బాలకృష్ణ, ఇతర నందమూరి హీరోలు ప్రచారానికి దిగాలనుకోవడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణ కాంగ్రెసు కోసం రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications