పవర్ షేరింగ్ పై చర్చించలేదు: రాఘవులు
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అధికార పంపకం (పవర్ షేరింగ్) పై తమతో చర్చించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. తెలంగాణపై తమ వైఖరి మారలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే విషయంపై కోల్ కత్తాలో కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 12,13,14 తేదీల్లో కోల్ కత్తాలో జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, ఎత్తుగడలను ఖరారు చేస్తుందని, ఈ సమయంలోనే రాష్ట్రంలో పెట్టుకునే పొత్తులపై నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈలోగా తమ పార్టీ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరై అభిప్రాయాలు తెలుసుకుంటారని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి టాటాల ప్రాజెక్టు వస్తే సంతోషిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. అయితే ప్రభుత్వ శక్తిసామర్థ్యాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్‌లో పారిశ్రామిక అశాంతి నెలకొందన్న వార్తలను ఆయన ఖండించారు. రాష్ట్రానికి ఇప్పటికి వరకు ఏ పరిశ్రమ కూడా రాకపోవడాన్ని బట్టి రాష్ట్రానికి ప్రభుత్వం నానో కార్ల ప్రాజెక్టును తెస్తుందనే నమ్మకం లేకుండా పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications