వైయస్ పై రోజా కస్సుబస్సు
వరంగల్ : రైతుల ఓట్లతో అధికారం కైవశం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని తెలుగుమహిళా అధ్యక్షురాలు రోజా విమర్శించారు. వరంగల్‌లో జిల్లా పార్టీ అధ్యక్షుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి గోదావరి జలసాధన పాదయాత్రను ముగించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి మిగతా సరకుల ధరలను పెంచారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్నీ పథకాలకు రాజీవ్,ఇందిరమ్మల పేర్లను పెడుతున్న ప్రభుత్వం బెల్టుషాపుల ముందు కూడా సోనియా చిత్రపటాలను వుంచాలని ఎద్దేవా చేశారు. బెల్టు షాపులపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications