రక్త చరిత్రకు అంగీకరించారు: వర్మ
అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవిపై రక్తచరిత్ర సినిమా తీయడానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ తెలిపారు. మద్దెల చెర్వు సూర్యానారాయణ రెడ్డితో పాటు పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీత సినిమా తీయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. శనివారంనాడు మద్దెలచెర్వు సూరిని కలిసిన వర్మ ఆదివారం పరిటాల సునీతను కలిశారు. తాను తీయబోయే సినిమా గురించి ఆమెతో మాట్లాడారు.
తన సినిమా ఎవరినీ బలపరిచేదిగా ఉండదని, సందేశాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తన రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడి పెడుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. సినిమా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆయన చెప్పారు. నవంబర్ 20వ తేదీ నుంచి షూటింగ్ జరుపుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications