నానో ప్రాజెక్టుకు గ్రామస్థుల వ్యతిరేకత
హైదరాబాద్: టాటా మోటార్స్ నానో ప్రాజెక్టు స్థాపన కోసం స్థలాన్ని పరిశీలించిడానికి వచ్చి ప్రభుత్వాధికారులకు ఆదివారం గ్రామస్థుల నుంచి చుక్కెదురైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని భూమిని నానో కార్ల ప్రాజెక్టుకు చూపించాలని భావించి అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారు. అయితే నానో ప్రాజెక్టుకు తమ భూములను ఇచ్చేదని లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. అధికారులను అడ్డుకున్నారు. రాస్తారోకో నిర్వహించారు. టాటా మోటార్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో చర్చలకు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
కాగా, టాటా మోటార్స్ నానో కార్ల ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించింది. తమిళనాడుతో సమానంగా రాయితీలిస్తామని ప్రబుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సింగూరు నుంచి నానో ప్రాజెక్టు నుంచి తరలించడానికి అయ్యే ఖర్చులో సగం భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు టాటా మోటార్స్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలకు హైదరాబాదు వస్తున్నారు.












Click it and Unblock the Notifications