సుస్మితా సేన్ అందాలకు వసీం ఫిదా
ముంబయి: బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అందాలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రం ఫిదా అయిపోయారు. కలర్స్ టీవీ చానెల్ ఏక్ కుషీ ఏక్ హసీనా షోకు వీరిద్దరు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. పోటీదారుల విషయాన్ని మరిచిపోయి ఆయన సుస్మితా సేన్ ప్రశంసల్లో మునిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సుస్మితా సేన్ పై ఆయన కవితా గానం కూడా చేస్తున్నారట.
తనకు బాలీవుడ్ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని వసీం అక్రం చెప్పారు. సుస్మితా సేన్ మంచి ప్రొఫెషనల్ అని, మంచి వ్యక్తి అని ఆయన ప్రశంసిస్తున్నారు. వసీం అక్రం సుస్మితాసేన్ పై మనసు పారేసుకుని ఆమెతో రోమాన్స్ కూడా నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications