వైయస్ వైఖరి తేల్చాలి: హరీష్
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ వైఖరి ఏమిటో తేల్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలమని చెబుతున్న కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించడంలో ఎందుకు తాత్సారం చేస్తోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ప్రజారాజ్యం కూడా తెలంగాణకు అనుకూలంగా ఉందని, కాంగ్రెస్ మాత్రమే తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ పార్టీ కూడా అడ్డంకిగా లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తోందని ఆయన అడిగారు. చిత్తశుద్ధి ఉంటే 2009లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పూనుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు రాకపోయినా 2009లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని, కాంగ్రెస్ వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, 2009లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications