తెలంగాణకు తెలుగుదేశం సై

తెలుగుదేశం కోర్ కమిటీ సభ్యులు పార్టీ నాయకుల నుంచి, శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని పరిశీలించి నివేదికను రూపొందించారు. అభిప్రాయ సేకరణలో చాలా వరకు తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అడ్డంకులన్నీ తొలిగినట్లైంది. తెలంగాణకు అనుకూలంగా అధికారిక నిర్ణయం ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం తెరాసతో పొత్తును ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ కన్నా ముందే పొత్తులు ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తున్నది.












Click it and Unblock the Notifications